వైసీపీకి బెజవాడలో బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయం మొత్తం కూడా రాజధాని చుట్టూనే తిరుగుతుంది. ఇది ఏమో గాని వైసీపీకి విజయవాడ లో భారీగా షాక్ తగిలే అవకాశం ఉంది అని అంటున్నారు. వైసీపీకి కీలక నేత ఒకరు రాజీనామా చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఆయన రాజధాని మార్పు విషయంలో గత కొన్ని రోజులుగా అసహనంగా ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. ఆయన మాట కనీసం ఎవరూ వినలేదు అనే బాధ ఆయనలో ఉంది.

పార్టీ పరిస్థితి విజయవాడలో చాలా దారుణంగా ఉంది అని, రాజకీయంగా కూడా పరిస్థితులు ఏ మాత్రం కూడా కలిసి వచ్చే అవకాశాలు లేవు అని ఆయన భావిస్తున్నారు. త్వరలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన ఒక మంత్రికి సమాచారం కూడా ఇచ్చారు అని, మంత్రి వారించినా సరే ఆయన ఆగే పరిస్థితి లేదు అని సమాచారం. మరి ఏమవుతుంది ఏంటీ అనేది చూడాలి.