కృష్ణాలో టీడీపీకి భారీ దెబ్బ..వైసీపీదే లీడ్.!

-

అమరావతి రాజధాని ప్రభావం అధికార వైసీపీపై ఎక్కువ ఉంటుందని, రాజధానికి దగ్గరగా ఉన్న జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందని విశ్లేషణలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజధాని ప్రభావం ఈ సారి ఎన్నికల్లో అంతగా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ప్రధానంగా సంక్షేమం ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు సంక్షేమంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.

సంక్షేమంలో జగన్ నెంబర్ 1గా ఉన్నారు. దీంతో ప్రజలు వైసీపీకి మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకే అమరావతి దగ్గరగా ఉంటూ, టి‌డి‌పికి కంచుకోట లాంటి జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకే ఆధిక్యం కనిపిస్తుంది. ఇక్కడ టి‌డి‌పి నేతల మధ్య ఆధిపత్య పోరు, వీక్ గా ఉండటం, అటువైపు వైసీపీ నేతలు బలంగా ఉండటంతో పరిస్తితులు తారుమారు అవుతున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది.

అయితే ఈ సారి వైసీపీ 14 సీట్లు గెలుచుకునే అవకాశం లేదు కానీ..ఆధిక్యం మాత్రం సంపాదించే ఛాన్స్ ఉంది. జిల్లాలో కనీసం 8-10 సీట్లలో వైసీపీకి ఆధిక్యం ఉంది. వైసీపీ పక్కాగా మళ్ళీ గెలిచే సీట్లలో గుడివాడ, గన్నవరం, పామర్రు, నూజివీడు, తిరువూరు సీట్లు ఉంటాయి. ఇప్పటికీ వైసీపీకి ఆధిక్యం ఉన్న సీట్లు వచ్చి..అవనిగడ్డ, మైలవరం, నందిగామ, విజయవాడ వెస్ట్, పెడన,కైకలూరు సీట్లు. అయితే టి‌డి‌పి-జనసేన విడివిడిగా పోటీ చేస్తే..నో డౌట్ మళ్ళీ కృష్ణాలో వైసీపీదే ఆధిక్యం.

అలా కాకుండా కలిసి పోటీ చేస్తే కాస్త డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో టి‌డి‌పి-జనసేనల మధ్య ఓట్లు బదిలీ కాకపోతే వైసీపీకే ప్లస్. ఎటు చూసుకున్న మళ్ళీ కృష్ణాలో వైసీపీదే లీడ్.

Read more RELATED
Recommended to you

Latest news