ఈ వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే..!

-

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నెలకొంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ చేస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటం లేదు. కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యటం వల్ల కరోనా రోగులను కాపాడవచ్చని డాక్టర్లు తెలియజేశారు. కరోనా నుంచి కోలుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధులు ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసారు. గుంటూరులో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటుచేసిన ప్లాస్మా డోనార్ సెల్‌లో బుధవారం రోశయ్య ప్లాస్మాను దానం చేశారు. ఈ సందర్భంగా ప్లాస్మాను దానం చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కరోనా బాధితులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, ఇప్పటికే కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ కూడా ప్లాస్మా దానం చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news