చైనాకి షాకిచ్చిన భారత్‌.. మరికొన్ని యాప్స్‌ పై బ్యాన్..?

-

భారత్‌లో మరికొన్ని చైనీస్ యాప్స్‌ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని తెలుస్తుంది. షావోమీకి చెందిన బ్రౌజర్, బైడుకు చెందిన బ్రౌజర్ యాప్స్ మీద నిషేధం విధించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కేంద్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని రాయిటర్స్ తెలిపింది. అయితే, మొత్తం ఎన్ని యాప్స్ మీద బ్యాన్ ఉందనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

apps-on-phone
 

అయితే ఇప్పటికే జూన్‌లో నిషేధించిన 59 చైనీస్ యాప్స్‌ కి క్లోన్ అయిన 47 చైనీస్ యాప్‌ లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. గల్వాన్ లోయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చైనా వస్తువులు, కంపెనీలను నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే చైనాతో తెగదెంపులు చేసుకుంటోంది భారత్. ఈ క్రమంలోనే చైనా కంపెనీలతో చేసుకున్న పలు ఒప్పందాలను రైల్వేశాఖ కూడా రద్దుచేసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news