ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం ఏమో గాని ఇప్పుడు అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజలకు ఎక్కువ ధరకు మద్యం ఇస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ అధికార పార్టీపై విమర్శలు చేసారు. కూలీలకు మద్యం దొరకడం లేదని, పిచ్చి బ్రాండ్ లు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.
దీనిపై ఎమ్మెల్యే ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రోజా టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ ఆఫీస్ లో బొండా ఉమా మద్యం బాటిల్ ప్రదర్శించడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ ఆఫీస్ లో మద్యం బాటిల్ ప్రదర్శించారు అంటే టీడీపీ ఆఫీసా మద్యం దుకాణం ఆ అని ప్రశ్నించారు. మద్యం బాటిల్ తో ప్రెస్ మీట్ పెడతారా అని నిలదేసారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచించేది పేదల కోసమే అని అన్నారు.
అలాంటి జగన్ పై ఆరోపణలు చేయడం దారుణమని రోజా మండిపడ్డారు. టీడీపీ నేతలను ఈ సందర్భంగా కోతులతో పోల్చారు. టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. వైఎస్ జగన్ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారని, 40 శాతం మద్యం దుకాణాలను తగ్గించామని ఆమె అన్నారు. టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారింది అంటూ రోజా ఆరోపణలు చేసారు. కూలీలకు మద్యం దొరకడం లేదని అనడం దారుణం అన్నారు.