ధూళిపాళ్ళను అందుకే అరెస్ట్ చేసారు: వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అరెస్ట్ వ్యవహారం సంచలనం అయింది. ఆయనను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నేపధ్యంలో పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య స్పందించారు. అక్రమాలు చేసినందుకే నరేంద్ర ను అరెస్ట్ చేసామని ఆయన అన్నారు. సంగం డైరీలో అక్రమాలు ఉన్నాయని అందుకే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.

అవినీతిని సహించేది లేదని అనవసరంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రతీ రూపాయి అవినీతిని బయటపెడతారు అని స్పష్టం చేసారు. అక్రమాలలో ఎవరు ఉన్నా సరే బయటకు లాగుతామని ఆయన స్పష్టం చేసారు. అవినీతిని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు.