రాష్టానికి ముఖ్యమంత్రి అవ్వాలంటే..అన్ని వర్గాల మద్దతు ఉండాలి.. అన్ని సామాజికవర్గాల ప్రజలు ఓటేసి.. దగ్గరికి తీసుకున్న పార్టీనే అధికారంలోకి వస్తుంది.. ఈ లాజిక్ ను అన్ని రాజకీయ పార్టీలో ఫాలొ అవుతూ ఉంటాయి.. సక్సెస్ అవుతుంటాయి.. కొన్ని సందర్బాల్లో మాత్రం ఘోరంగా ఓడిపోతుంటాయి.. గత ఎన్నికల్లో కూడా వైసీపీకి ఇదే అనుభవం ఎదురైంది..
ఏపీలో కులాల రాజకీయం ఎక్కువగా ఉంటుంది. తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తున్నా.. పార్టీ స్తాపించినా.. అండగా ఉంటారు..ఆర్తికంగా కూడా బ్యాక్ బోన్ గా వ్యవహరిస్తారు.. ఉమ్మడి ఎపీలో కాంగ్రెస్ కు మొదటి నుంచి రెడ్లు అండగా ఉంటున్నారు.,. తెలుగుదేశం పార్టీకి కమ్మ, బీసీలోని కొన్ని వర్గాలు మద్దతుగా ఉంటాయి. వైసీపీని స్తాపించినప్పుడు రెడ్డి వర్గమంతా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి అతని మద్దతుగానిలిచారు..
2014,2019 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గంతో పాటు.. బీసీలు, ఎస్సీ,ఎస్టీలు, బలిజలు పెద్ద ఎత్తున ఆయన తోడ్పాటునందించారు.. 2014లో అధికారం రాకపోయినా.. బలమైన ప్రతిపక్షంగా నిలిచారు.. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.. కానీ 2024లోకి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది.. రెడ్డి సామాజికవర్గానిక చెందిన వారే ఆయనకు పోటు పొడిచారనే ప్రచారం జరిగింది..
దీంతో రెడ్డి సామాజికవర్గానికి దగ్గరయ్యేందుకు వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట.. పార్టీ బలోపేతంలో, సంస్థాగత నిర్మాణంలో, పదవుల్లో వారికిప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట.. పార్టీ వీడిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లుపార్టీలో చర్చ నడుస్తోంది.. వచ్చే ఎన్నికల నాటికి తమ సామాజికవర్గానికి చెందిన వారిని దగ్గరకుతీసుకోవాలనే ప్లాన్ లో జగన్ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి..