మంగళగిరి పై వైసీపీ దృష్టి.. మరోసారి నారా లోకేష్ కు ఓటమి తప్పదా..?

-

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మారుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలకు టిక్కెట్లుస్తోంది. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. కీలకమైన నియోజకవర్గాలలో వారికి అవకాశం కల్పిస్తుంది వైసిపి.. గత ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తుంది.

చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానంలో కూడా విజయం సాధించేలా వైసీపీ ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై లోకేష్ ఓటమి పాలయ్యారు. ఈసారి ఆర్కే పార్టీ వీడటంతో గంజి చిరంజీవిని పోటీకి పెట్టారు సీఎం జగన్. బీసీ సామాజికవర్గానికి చెందిన చిరంజీవి.. గతంలో టీడీపీ తరపున పోటీ చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. రైతు భరోసా, నేతన్న నేస్తం వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లని వైసీపీకి పడతాయని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్యే ఆర్కే ని కాదని.. గంజి చిరంజీవికి సీఎం జగన్ అవకాశం కల్పించారట.

ఈ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారని పార్టీలో చర్చ నడుస్తుంది. ఇప్పటివరకూ గుంటూరు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌లుగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ స్థానంలో విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.. విజయ్ సాయి రెడ్డి నియోజకవర్గంలో ఉండే ముఖ్య నేతలతో పాటు ఓటర్లను ప్రభావితం చేయగలిగే వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారట. టిడిపి ఒక్కసారి కూడా గెలవని ఈ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరవేయాలని.. అందుకు అవసరమైన అస్త్ర శస్త్రలను విజయసాయిరెడ్డి సిద్ధం చేస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో ఉండడంతో మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పెద్దగా ఫోకస్ చేయడం లేదని టిడిపి నేతలు చెప్తున్నారు. ఈసారి కూడా లోకేష్ కు ఓటమి తప్పదని సొంత పార్టీ నేతలే చర్చించుకోవడం హైలెట్గా మారింది

Read more RELATED
Recommended to you

Latest news