‘ఫ్యాన్స్’ పోరు: ఓడిపోయే వరకు వదలరా?

-

వైసీపీలో అంతర్గత పోరు…ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కుమ్ములాటలు..ఈ నియోజకవర్గంలో నేతల మాటల యుద్ధం. సొంత పార్టీ వాళ్లే తనపై కుట్ర చేస్తున్నారు..ఇవి ఈ మధ్య మీడియాలో కనిపించే కథనాలు. ప్రతిరోజూ వైసీపీలో జరిగే అంతరయుద్ధం గురించి నడుస్తున్న గుసగుసలు. ప్రతిరోజూ ఎక్కడొక చోట ఎవరోకరు తమ పార్టీలో జరిగే రచ్చ గురించి మాట్లాడుతూనే ఉంటున్నారు. అలాగే ఎక్కడకక్కడ నేతల మధ్య తగాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ మధ్య వరుసపెట్టి వైసీపీలో నడుస్తున్న ఆధిపత్య పోరు గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల గన్నవరంలో వైసీపీ నేతల మధ్య వార్ నడిచింది. అటు మచిలీపట్నంలో ఎమ్మెల్యే, ఎంపీలకు పడటం లేదని వార్తలు వచ్చాయి. ఇక హిందూపురంలో ఏకంగా వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే కార్యక్రమం చేశారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం తనపై సొంత పార్టీ నేత కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, వైఎస్సార్ ఫ్యామిలీకి దగ్గర బంధువు…అందులోనూ రెడ్డి వర్గం నాయకుడు. ఈయనే బయటకొచ్చి ఆవేదన వ్యక్తం చేశారంటే మిగిలిన నేతల పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక బాలినేని వెనుకే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకొచ్చారు. తన నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జోక్యం చేసుకుని తనని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తాను…వేరే నియోజకవర్గాల్లో వేలు పెడతానని, లేదంటే పార్టీ వీడటానికి కూడా సిద్ధమని అంటున్నారు.

అంటే వైసీపీలో విభేదాలు ఏ స్థాయిలోకి వెళ్లిపోయాయో అర్ధం చేసుకోవచ్చు. సొంత పార్టీ వాళ్ళని ఓడించడానికి…సొంత వాళ్ళే పనిచేస్తున్నారంటే…ఇంకా వైసీపీ గురించి ప్రజలు ఏం అనుకుంటారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది…ఇలాంటి సమయంలోనే అంతర్గత విభేదాలు…ఈ విభేదాలు జగన్ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది…లేదంటే సొంత వాళ్లే పార్టీని ఓడించే వరకు వదిలేలా లేరు.

Read more RELATED
Recommended to you

Latest news