జగన్ ని ఫాలో అవుతున్న యోగి ఆదిత్యనాథ్..!!

-

వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా మామూలు సమయంలో ఇప్పుడు కూడా చాలా ప్రభావితం అవుతున్నాయి. జగన్ ఐడియా లో నుండి వచ్చిన వాలెంటర్ల సిస్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రానికి గుండెకాయ గా మారింది. ముఖ్యంగా ఈ వైరస్ విదేశాల నుండి వచ్చిన వాళ్లకి ఎక్కువగా ఉండటంతో వాళ్లను చాలా తక్కువ టైమ్ లోనే జగన్ సర్కార్ వాలంటీర్ల సిస్టం ద్వారా గుర్తించగలిగి వైరస్ ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.Image result for ys jagan yogi adhitya nathఒక విధంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు తమ ప్రాణాలను పెట్టి మరి పని చేస్తున్నారు. అలాగే నిత్యావసర సరుకుల విషయంలో సరికొత్తగా ఇంటింటికి వాలంటీర్ల ద్వారా అందించటానికి జగన్ సరికొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో ఇదే నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఫాలో అవుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు ఉండడంతో 21 రోజులు ప్రజలంతా ఇంటికే పరిమితం కానున్న క్రమంలో ఉత్తరప్రదేశ్లో రాబోయే రోజుల్లో పదివేల వాహనాల్లో ఇంటింటికి సరుకులు పంపించడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రెడీ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news