డబ్బులు ఉన్నాయి కదా అని ఎగబడి సరుకులు కొనకండి .. అదే మీ కొంప ముంచుతుంది !

-

ప్రధాని మోడీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీంతో నిత్యావసర సరుకులు మరియు కూరగాయల దగ్గర డబ్బు ఉంది కదా అని ఎగబడి సరుకులు కొంటే ఖచ్చితంగా అదే మళ్లీ మన కొంప ముంచుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల ప్రస్తుతం దేశంలో ఐశ్వర్యవంతులు నుండి పేదవాళ్ల వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో డబ్బు ఉంది కదా అని కిరాణా షాపు వద్ద పరిమిత కాల సమయంలో కొన్ని నెలలపాటు సరుకులు తీసుకోవటానికి టైం వెచ్చిస్తే వెనక ఉన్న పేద వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుందని వాళ్ళ కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు లాక్ డౌన్ ఈ సమయంలో వ్యవహరించాలని చాలామంది కోరుతున్నారు. Image result for rythu bazarప్రస్తుతం ఎవరికీ పని లేదు…దీంతో ఏ రోజుకి ఆ రోజు అనే పేదవాళ్ల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో మీరు కొనడంతో ఆత్యాశకు అనుగుణంగా అమ్మే వాడిలో ధరలు పెంచే దురాశ ప్రతిధ్వనిస్తుంది. వ్యాపారి ఆశ పెరుగుతుంది. మరి అప్పుడు ఆ అభాగ్యుడి గతేం కాను.. మీ కొనుగోలు శక్తితో ధరలను పెంచేస్తే.. ఎంత అడిగితే అంత ఇచ్చేసి కొంటే.. సామాన్యుడి సంగతి ఏంటి..? మీరు సరుకులు పోగేయకపోతే .. ఏమవుతుంది.. నాలుగు రోజులు పచ్చడి మెతుకులో, ఎల్లిపాయ కారంతో నాలుగు ముద్దలు తింటేనో మీకు పెద్ద నష్టమేమీ కాదు కదా.

 

ఏ మాత్రం ఆకలి కేకలు పేదవాళ్ల లో ఎక్కువైతే సమాజంలో పరిస్థితి మొత్తం మారిపోతుందని అది మీ కొంప ముంచుతోంది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది ప్రముఖులు సూచనలు ఇస్తున్నారు. కాబట్టి పేద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కీలకమైన లాక్ డౌన్ సమయంలో డబ్బున్నవాళ్ళు దయనీయంగా ప్రవర్తించాలని కోరుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news