జ‌గ‌న్ స్కెచ్ మామూలుగా లేదుగా… ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

-

రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు… వ్యూహాలు, ప్రతివ్యూహాలు చాలా ముఖ్యం. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీని ఢీ కొట్టేందుకు ఎలాంటి ఎత్తులు వేయాలో… ఒక్కోసారి సొంత పార్టీలో నేతలకు చెక్ పెట్టేందుకు సైతం అదే తరహా ఎత్తులు, పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ఇప్పుడు అదే తరహాలో ముందుకు వెళ్తున్నారు. సొంత పార్టీలో నేతలు తోకాడిస్తుండ‌డంతో వారు ఎంత సీనియర్లు అయినా జగన్ వారిని ఎంత మాత్రం లెక్క చేయడం లేదు. పార్టీలో ఉంటారా క్రమశిక్షణతో ఉండండి… పార్టీ గీత దాటితే ఇలాంటి వారి పైన అయినా వేటు త‌ప్ప‌ద‌ని నిర్దాక్షిణ్యంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సీనియర్ నేత అని చూడకుండా షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పార్టీ నేతలు ఎంత క్రమశిక్షణగా ఉండాలో జగన్ చెప్పకనే చెప్పినట్లయింది. ఇక తాజాగా బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, ఆర్ఎస్ఎస్ వాది, మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు త‌న కుటుంబంతో సహా వైసీపీలో చేరుతున్న సంగ‌తి తెలిసిందే.

జ‌గ‌న్ గోక‌రాజును పార్టీలోకి ఆహ్వానించ‌డానికి అటు బీజేపీతో పాటు ఇటు త‌న పార్టీలోనే తాకాడిస్తోన్న న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు అన్న టాక్ వైసీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది. ర‌ఘురామ‌కృష్ణం రాజు ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చి ఎంపీగా గెలిచారు. అప్ప‌టి నుంచి ఆయ‌న బీజేపీ నేత‌ల‌తో అంట కాగుతున్నారు. ఆయ‌న బీజేపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. జ‌గ‌న్ క్లాస్ తీసుకున్నా ఆయ‌న తీరు మాత్రం మార‌డం లేదు స‌రిక‌దా.. ఢిల్లీలో వైసీపీ వ‌ర్గాల‌కు పెద్ద త‌ల‌పోటుగా మారార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు క‌రెక్టుగా చెక్ పెట్టేందుకే జ‌గ‌న్ గోక‌రాజు
ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకుంటున్నార‌ని.. ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సభ సీటు కూడా ఇస్తార‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news