వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంట్
వేదికగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.. వక్ఫ్ చట్టం సవరణను వైసిపి తీవ్రంగా వ్యతిరేకించింది. తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించింది.. ఈ సవరణ బిల్లు మీద ఎలాంటి కసరత్తు చేయకుండానే బిజెపి లోక్సభలో ప్రవేశపెట్టిందట.. కనీసం తటస్థ పార్టీల సైతం సంప్రదించలేదు.
మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీలకు ఈ ఏడాది జరగాల్సిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం వక్ఫ్ చట్టం సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది.. తటస్థ పార్టీలు కూడా ఈ సవరణ బిల్లుకు మద్దతు ప్రకటిస్తాయని బిజెపి భావించింది.. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు లోక్సభలో మిథున్ రెడ్డి ప్రకటించారు.. వైసిపి తీసుకున్న ఏ నిర్ణయం జాతీయస్థాయిలో కొత్త చర్చకు దారితీస్తోంది..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహితంగా ఉండేవారు.. ఏపీకి నిధుల విషయంలో కూడా పలుమార్లు ఆయన మోడీని కలిశారు.. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అనే ప్రచారం జరుగుతుంది.. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి బిజెపికి దూరమై.. ఇండియా కూటమికి దగ్గరవుతున్నారనే చర్చ జాతీయ స్థాయిలో నడుస్తోంది.. అందులో భాగంగానే వక్ఫ్ చట్టం సవరణ బిల్లును వైసీ వ్యతిరేకించిందట. వైసీపీ బలం ఏంటో టైం చూసి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి చూపెట్టారని కూటమి పార్టీలు భావిస్తున్నాయి.
ఏపీలో అధికారం కోల్పోయిన జాతీయ స్థాయిలో తమ పార్టీ హవా ఏ మాత్రం తగ్గలేదనే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి మోడీకి పంపారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇండియా కూటమి వైపు జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని అందుకే బిజెపి ప్రవేశపెట్టిన ఈ బిల్లుని వ్యతిరేకించారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.. వైసిపి మాత్రం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఏ బిల్లుకుతావో మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేస్తుంది..