స్విచ్ మీద జగన్ చేయి రెడీ గా ఉంది .. గ్రీన్ బటన్ నొక్కడమే లేటు !

-

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు గెలిచిన తరువాత వైసీపీ పార్టీకి చెందిన నాయకులను చాలామందిని తన పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మంత్రి పదవి లేకపోతే ఆర్థిక సాయం ఇలా రకరకాల ఆఫర్లు చూపి చంద్రబాబు అప్పట్లో వైసిపి పార్టీకి చెందిన నాయకులను తన పార్టీలోకి చేర్చుకున్నారు. తమని గెలిపించిన జగన్ ని ఆ టైంలో ఆ నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. 2014 ఎన్నికల తర్వాత జంపింగ్ జపాంగ్ లపై టిడిపి ఫోకస్ పెట్టి 2017 వరకు నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. వీరిలో కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇస్తామని కూడా చెప్పటం జరిగింది.YS Jagan Mohan Reddy announces lockdown of Andhra Pradesh till ...తీరా పార్టీలో జాయిన్ అయిన తర్వాత చాలామంది నాయకులు మోసపోయారు. ఇస్తామన్న పదవులు టిడిపి ఇవ్వలేదు. ఇలా వెళ్ళిన వారిలో పామ‌ర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్పన , పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వరిలు కీల‌కంగా ఉన్నారు. వీరంతా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్ని హితులు కానీ, చంద్రబాబు విసిరిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు లొంగిపోయారు. ఆ తర్వాత గత సార్వత్రిక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన వీళ్లు జగన్ సునామీ కి తట్టుకోలేక పోయారు. అందరూ ఓడిపోయారు. అప్పుడు టిడిపి ప్రలోభాలకు లొంగకుండా పార్టీలో ఉండి ఉంటే కచ్చితంగా ఇప్పుడు వీళ్ళు మాత్రం చక్రం తిప్పే వాళ్ళు.

 

ఇటువంటి నేపథ్యంలో వీళ్ళని ప్రస్తుతం తెలుగుదేశం థియేటర్ పక్కన పెడుతున్న తోరణంలో… ఈ మహిళ నాయకులంతా తిరిగి వైసీపీ లోకి రావడానికి రెడీ అయ్యారు. మరోపక్క పార్టీలోకి వీళ్ళని తీసుకోవడానికి జగన్ కూడా రెడీగా ఉన్నట్లు స్విచ్ మీద జగన్ చేయి పడి గ్రీన్ బటన్ టైపు లో సిగ్నల్ వస్తే చాలు వెంటనే వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి ఈ మాజీ వైసిపి మహిళా నేతలు రెడీ అవుతున్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news