పవన్‌ భార్యలకు ఐదుగురు పిల్లలు.. వాళ్లు ఏ స్కూల్‌లో చదువుతున్నారు: సీఎం జ‌గ‌న్‌

-

వైఎస్ జగన్ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన జగన్.. ఇంగ్లీష్ బోధనపై విమర్శలు గుప్పించిన వారికి స్ట్రాంగ్ కౌంటర్, ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలని, అది ఒక్క ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలతోనే సాధ్యమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అయితే పేదలు కూడా రాణించాలంటే.. ఇంగ్లీషు మీడియం చదువులు ముఖ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజుల క్రితం జీవో ఇచ్చాం. చంద్రబాబు, వెంకయ్య, పవన్ కళ్యాణ్ వంటి వారి నోళ్లు తెరచుకున్నాయి. మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకు..?. ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఒకసారి ఆలోచన చేయాలి.

మీ కొడుకులు, మనవళ్లు ఏ మీడియంలో‌ చదువుతున్నారు. ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించేవారు.. వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు..?.చంద్రబాబు కుమారుడు, మనవడు ఏ మీడియంలో చదువుతున్నారు?. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్‌లో చదువుతున్నారో చెప్పాలి..?. యాక్టర్ పవన్ భార్యలకు ఐదుగురు పిల్లలు.. వాళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు.?” అని ఈ సందర్భంగా విమర్శలకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news