ఆ మంత్రి విషయం లో కనికరం కూడా లేకుండా వార్నింగ్ ఇచ్చిన జగన్ .. అందరి ముందూ .. !

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క రాష్ట్ర అభివృద్ధిని సమపాళ్ళలో చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో గత ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించిన వైయస్ జగన్ రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా అదే స్థాయిలో గెలవాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైసిపి మంత్రుల లో టెన్షన్ పెడుతోంది. Image result for jagan

విషయంలోకి వెళితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాల, ఓడాల అనే నిర్ణయాన్ని, దాని ఫలితాన్ని అనుభవించే బాధ్యలను పూర్తిగా మంత్రులకు అప్పగించారట సీఎం జగన్‌. ముఖ్యంగా జిల్లాల్లో మెజారిటీ తప్పనిసరిగా సాధించాల్సిందేనంటూ ఇన్‌చార్జి మంత్రులను ఆదేశించారని వైసీపీ పార్టీలో టాక్. అంతేకాకుండా మెజారిటీ దక్కించుకోలేకపోతే ఉన్న మంత్రి పదవి కూడా ఊడిపోయే అవకాశం ఉంది అన్నట్టు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చాడట.

 

ముఖ్యంగా ఒక సీనియర్ మంత్రికి అందరికీ జగన్ కనికరం లేకుండా స్థానిక ఎన్నికల్లో మీ జిల్లాలో సరైన రిజల్ట్ రాకపోతే విషయం వేరే లాగా ఉంటుందని చాలా సీరియస్ గా జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే తరుణంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు జగన్ సూచించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news