అబ్బో, అనుష్క అందుకే అంత ఆనందంగా ఉందా….??

-

సూపర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన అనుష్క శెట్టి, ఫస్ట్ సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత ఆమెకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా, అవి ఆమె కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదు. అయితే ఆ తరువాత కోడిరామకృష్ణ దర్శకత్వంలో మల్లెమాల సంస్థలో ఆమె నటించిన అరుంధతి సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో అనుష్క కు విపరీతమైన క్రేజ్ లభించింది. ఇక అక్కడి నుండి ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా వరుసగా పెద్ద హీరోల సరసన అవకాశాలు అందుకున్న అనుష్క, ఇటీవల రాజమౌళి తీసిన బాహుబలి సినిమాల సక్సెస్ తరువాత మరింత గొప్ప పేరు దక్కించుకుంది.

అయితే ఇటీవల కొంత సెలెక్టీవ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్న అనుష్క, ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం అనే క్రైం థ్రిల్లర్ మూవీ లో నటిస్తోంది. ఇకపోతే రెండు రోజుల క్రితం నాని నిర్మాతగా, విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న హిట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తళుక్కున మెరిసిన అనుష్క, ఆ ఫంక్షన్ లో ఎంతో ఆనందంగా గడపడం, మాట్లాడడం గమనించవచ్చు. అయితే అదే రోజున అనుష్క మీడియాతో మాట్లాడుతూ, తన పెళ్లి విషయమై వస్తున్న వార్తలు అన్ని ఫేక్ అని చెప్పిన అనుష్క, తన తల్లితండ్రులు చూసిన సంబంధాన్నే తాను చేసుకుంటానని అన్నారు. అయితే అదే రోజు సాయంత్రం హిట్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ఆమె ఎంతో సంతోషంగా కనపడడంతో, ఒకవేళ ఆమెకు పెళ్లి సంబంధం నిశ్చయం అయిందా ఏంటి, అని కొందరు టాలీవుడ్ వర్గాల వారు గుసగుసలాడుతున్నారు.

 

నిజానికి ఇటీవల అనుష్క బయటకు వచ్చిన సందర్భాల్లో ఇంత సంతోషంగా ఎప్పుడూ కనపడలేదని, బహుశా ఇంట్లో వారు ఆమెకు తగిన సంబంధాన్ని వెతికి ఉంటారు, అందుకే ఆ ఆనందంలో ఆమె అంత ఉల్లాసంగా ఉండి ఉంటారని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంతవరకు ఉందొ తెలియదు గాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం, తమ హీరోయిన్ పెళ్లి వార్త కోసం ఎదురు చూస్తున్న అనుష్క ఫ్యాన్స్ కు ఇది మంచి తీపి కబురనే చెప్పాలి..!!

Read more RELATED
Recommended to you

Latest news