జ‌గ‌న్ ఆ విష‌యంలో రాంగ్ స్టెప్ వేస్తున్నాడా..?

-

ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ వైఖ‌రిలో ఇటీవ‌ల మార్పు వ‌స్తోందా.. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న చేసిన ప్ర‌క ట‌న‌ల‌కు, ఎన్నిక‌ల విజ‌యం త‌ర్వాత ఆయ‌న విధానాల‌కు స్ప‌ష్టమైన తేడా క‌నిపిస్తుందా అంటే వైసీపీ నే త‌లు అవున‌నే అంటున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీసీ 151 సీట్లను సాధించింది.  ప్రతిపక్ష టీడీపీ కేవ‌లం 23 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. ఇప్పుడు శాసనసభలో వైసీపీదే పూర్తి స్థాయి ఆధిపత్యం. అయితే వైఎస్ జగన్ నాలుగు నెలలు మౌనంగా ఉండి ఇప్పుడు పార్టీ గేట్లను బార్లా తెరవడం వెనక ఆంత‌ర్యం ఏంటి అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. ముఖ్యంగా పార్టీ క్యాడర్, నేతలు ఈ విషయంలో జగన్ పై నమ్మకం ఎక్కువగా పె ట్టుకున్నారు. కానీ కొద్దిరోజులుగా వైసీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసి సొంత పార్టీ నేతలే అవాక్కవుతున్నారు. విశ్వసనీయతకు జగన్ చిరునామాగా భావించిన వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇప్పటికే పార్టీలో నాయ‌కుల‌కు కొద‌వ‌లేదు. అయినా ఇత‌ర పార్టీల నుంచి చేరిక‌ల‌ను జ‌గ‌న్ ప్రోత్స‌హిస్తుండ‌టం నాయ‌కుల‌కు ఏమాత్రం రుచించ‌డంలేదు.  పార్టీకి ఏమాత్రం ఉపయోగపడని, జనంలో బలంలేని నేతలను పార్టీలోకి తీసుకోవ‌డాన్ని కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. అస‌లు ఇప్ప‌టికిప్పుడు ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను పార్టీలో  చేర్చుకోవాల్సిన అవ‌స‌రం కూడా లేదు.

ఇత‌ర పార్టీల‌కు చెందిన బ‌లం లేని నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకోవ‌డంతో వైసీపీ కోసం క‌ష్ట‌ప‌డిన నేత‌లు అంద‌రు ఇప్పుడు షాక్ అవుతున్నారు. మరో 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రి గా కొనసాగుతానని చెప్పిన జగన్ ఇలా మాట మారిస్తే.. ఎలా కొన‌సాగుతారు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే సొంత పార్టీ నేత‌ల మ‌ధ్యే గ్రూపు త‌గాదాల గోల ఎక్కువ‌వుతుంద‌ని… అప్పుడు తీవ్ర వ్య‌తిరేక‌త   త‌ప్ప‌ద‌ని ఆ పార్టీ నేత‌లే గుస‌గుస‌లాడ‌టం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news