అమ‌రావ‌తిపై పారిన వైసీపీ పాచిక‌..!

-

వైసీపీ పాచిక పారింది. అనుకున్న‌ట్లుగానే వైసీపీ ట్రాప్‌లో టీడీపీ ప‌డింది. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని కేంద్రాన్ని జ‌ర‌పాల‌కున్న‌ప్పుడు స‌హ‌జంగానే స్థానిక ప్ర‌జానీకం, రైతులు చుట్టూ ప‌క్క‌ల ప్రాంతాల్లోంచి కొంత వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని ముందే ఊహించింది వైసీపీ. వైసీపీ చాలా పకడ్బందీ వ్యూహంతోనే అమరావతి విషయాన్ని హైలెట్ చేస్తోంది. అమ‌రావ‌తి ఏపీ రాజ‌ధానిగా అస్స‌లు ప‌నికిరాద‌ని సంబంధిత శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌దేప‌దే మీడియాకు చెబుతూ వ‌స్తున్నారు.

అయితే వాస్త‌వానికి వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లు ఊహించిన‌తంగా వ్య‌తిరేక‌త లేద‌ని ఆ పార్టీ నేత‌లు సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌వుతున్నార‌ట‌. రాజ‌ధాని విష‌యంలో వైసీపీ ద్విముఖ వ్యూహంతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఒక‌టి అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల్లో టీడీపీకి పెద్ద‌గా లాభం చేకూర‌కుండా చేయ‌డం…రెండోది ఇత‌ర ప్రాంతాల నుంచి వైసీపీ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోవ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాష్ట్రంలో నాలుగు రాజ‌ధానులు అంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఆ ప్రాంతాల్లో కొత్త ఆశలు చిగురించాయి.టీజీ వెంక‌టేష్ పేర్కొన్న నాలుగు రాజ‌ధానుల్లో విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప పేర్లను ప్రకటించడంతో ఆ ప్రాంతవాసులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది అమరావతిపై.. ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతోంది.

ఇదే అద‌నుగా త్వ‌ర‌లో ప్రాంతీయ బోర్డుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్రకటించాలని వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ప్రతిపక్షమైన టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఇదే మంచి అవ‌కాశ‌మ‌ని ఆ పార్టీ వ్యూహ‌క‌ర్త‌లు భావిస్తున్నారు. రాజధాని రైతుల తరపున ఒకవేళ తెలుగుదేశం ఆందోళనకు దిగితే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి ఒక్క రాజధాని కోసమే తెలుగుదేశం ఆందోళనకు దిగుతోంద‌న్న అభిప్రాయం ఆ ప్రాంతాల్లో ఏర్ప‌డుతుంద‌ని, అంతిమంగా టీడీపీ న‌ష్టం చేకూరుస్తుంద‌ని భావిస్తోంది.

బీజేపీ కూడా రాజధానిని అమరావతిలోనే ఉంచాలని ప్రకటన చేయటం, ఆ పార్టీ నేతలు సైతం రాజధానిలో పర్యటించటం, సీపీఐ, సీపీఎం నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతులతో గళం కలపటం వైసీపీ నేతలకు కాస్త ఇబ్బందికరంగా మారింది. అయితే జ‌నాల్లో మాత్రం పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news