రిస్క్‌లో ‘ఫ్యాన్’ ఎమ్మెల్యేలు… అంతా మైనస్సే?

-

వైసీపీ ఎమ్మెల్యేలు రిస్క్ లో ఉన్నారా? వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారా? అంటే ఇటీవల జగన్…ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన దాన్ని బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది…అలాగే పనితీరు మెరుగు పర్చుకోకపోతే నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు ఇవ్వనని చెప్పడం బట్టి చూస్తే…చాలామంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదనే అర్ధమవుతుంది. మామూలుగా అధికార పార్టీపై కాస్త వ్యతిరేకత ఉంటుంది…కానీ వైసీపీపై ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది…ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే ఎమ్మెల్యేల పరిస్తితి బాగోలేదనే చెప్పొచ్చు.

అయితే టీడీపే అనుకూల మీడియా వైసీపీపై బాగా నెగిటివ్ ప్రచారం చేస్తుంది…గడప గడపకు వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలని ప్రజలు నిలదీస్తున్నారని, తిరగబడుతున్నారని, మంత్రుల బస్సు యాత్ర ఘోరంగా ఫెయిల్ అయిందని కథనాలు వేస్తుంది. ఇక ఇదంతా టీడీపీ అనుకూల మీడియా కథనాల బట్టి ఉంది…అంటే ఇక్కడ పూర్తిగా ఆ మీడియాని నమ్మడానికి లేదు. కాకపోతే తాజాగా జగన్..ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న దాని బట్టి చూస్తే వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఉందని అర్ధమవుతుంది.

ఇక ఎమ్మెల్య భారం తాను మోయలేనని, ప్రతి ఒక్కరూ గడప గడపకు వెళ్లాలని, ఆరు నెలల్లో పనితీరు మెరుగు పరుచుకోవాలని లేదంటే ఎమ్మెల్యే సీటు ఇవ్వనని జగన్ తేల్చి చెప్పారు. అయితే ప్రజా వ్యతిరేకతకు ఎమ్మెల్యేలే కారణమా? అంటే కాదనే చెప్పాలి…ఎందుకంటే ప్రభుత్వంపై కూడా ప్రజా వ్యతిరేకత ఉంది…అలాంటప్పుడు ప్రభుత్వం పనితీరు కూడా మారాలి. ఏదో సంక్షేమ పథకాల అమలు ఒక్కటే ప్లస్ అవుతుంది తప్ప….మిగిలినవన్నీ మైనస్సే అన్నట్లే పరిస్తితి ఉంది.

తాగునీరు, రహదారులు, డ్రైనేజ్ సమస్య, ఇసుక సమస్య, విద్యుత్తు చార్జీల పెంపుదల, చెత్త పన్ను, ఆస్తిపన్ను పెంపు, ధరల పెరుగుదల, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం..ఇవే కాదు. ప్రత్యేక హోదా నుంచి ఉద్యోగాలు కల్పించకపోవడం వరకు ప్రజలు..ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు…అయితే ప్రజల్లో తిరుగుతున్న ఎమ్మెల్యేలపైనే ఈ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకే రిస్క్ ఎక్కువ ఉంది…కాబట్టి ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వం పనితీరు కూడా మెరుగుపడాలని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news