పవన్ వైపే వైసీపీ..బ్రేక్ వేయాల్సిందే.!

-

మరొకసారి అధికారం దక్కించుకోవాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్న విషయం తెలిసిందే..రెండో సారి అధికారం దక్కితే రాజకీయంగా ఇంకా తిరుగులేని బలం పొందవచ్చు అనేది జగన్ ఆలోచన. అప్పుడు ప్రతిపక్షాలని ఇంకా దెబ్బకొట్టవచ్చు. అలా కాకుండా పొరపాటున కసితో ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ వైసీపీ పొజిషన్ ఏంటి అనేది ఊహాకే అందదు.

కాబట్టి నెక్స్ట్ కూడా అధికారంలోకి రావడం జగన్ తక్షణ కర్తవ్యం. అందుకు ఎప్పటికప్పుడు అదిరిపోయే వ్యూహాలతో జగన్ ముందుకెళుతున్నారు. అయితే నెక్స్ట్ అధికారంలో రావాలంటే చంద్రబాబు కంటే ముందు పవన్‌ని కట్టడి చేయడం చాలా అవసరమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటి బాబు కదా బలమైన నాయకుడు..టీడీపీ బలమైన పార్టీ అనుకోవచ్చు. టీడీపీ బలమైందే..వైసీపీకి చెక్ పెట్టే సత్తా టీడీపీకే ఉంది.

కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది..ప్రస్తుతం టీడీపీ..వైసీపీకి చెక్ బలం పూర్తిగా రాలేదు. కొంతవరకు బలం వచ్చింది గాని..పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చే బలం రాలేదు. ఆ బలం రావాలంటే పవన్‌ని కలుపుకోవాలి. పవన్‌ని కలుపుకుంటేనే డౌట్ లేకుండా వైసీపీకి చెక్ పెట్టొచ్చు. దీనిపై జగన్‌కు కూడా క్లారిటీ ఉంది. టీడీపీతో గాని జనసేన కలిస్తే తమకు రిస్క్ అని జగన్‌కు తెలుసు. ఇటీవల వచ్చిన వైసీపీ అంతర్గత సర్వేల్లో కూడా అదే స్పష్టమైందట. అందుకే ఇప్పుడు బాబుని టార్గెట్ చేయడంతో పాటు పవన్‌ని గట్టిగా టార్గెట్ చేయాలని జగన్..వైసీపీ నేతలకు గైడెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు బాబు-పవన్ కలవకుండా కొత్త ఎత్తులతో ముందుకెళ్లాలని చూస్తున్నారట. ఎలాగైనా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోకుండా చేయాలనేది వైసీపీ టార్గెట్‌గా ఉంది. అందుకే ఈ మధ్య మంత్రులంతా..పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని రెచ్చగొట్టే సవాళ్ళు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. అంటే అలా చేస్తే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకోరు అనేది వైసీపీ కాన్సెప్ట్. రానున్న రోజుల్లో టీడీపీ-జనసేన పొత్తు లేకుండా చేయడానికి వైసీపీ మరింత దూకుడుగా పవన్‌ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version