సినీ ఇండస్ట్రీలో ఎంతమంది సెలబ్రిటీల మధ్య స్నేహబంధం ఉండనే ఉంటుంది. ఇక అంతే కాకుండా కొంతమంది సెలబ్రిటీలు వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా చనువుగా ఉంటారు. అలాంటివారిలో మంచు లక్ష్మి, రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరని చెప్పవచ్చు.
వీరిద్దరి వయసులో కాస్త తేడాగా ఉన్న వీరిద్దరి మాత్రం చాలా దృఢమైన బంధంతో ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలాంటి సందర్భం వచ్చినా సరే మంచు లక్ష్మి రకుల్ ఇద్దరు ఒకటి అవుతారని చెప్పవచ్చు. ఇద్దరు కూడా పార్టీలకు వెళుతూ బాగా ఎంజాయ్ చేసిన సందర్భాలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ కూడా ఉంటారు.
ఇక నిన్నటి రోజున రకుల్ ప్రీతిసింగ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా తనకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసింది మంచు లక్ష్మి. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అంతేకాకుండా రకుల్ ప్రీతిసింగ్ పై మంచు లక్ష్మి ఒక ట్యాగ్ లైన్ కూడా రాసి వార్తలను షేర్ చేసింది. హ్యాపీ బర్తడే మైడియర్ రకుల్ నీలాంటి నిజాయితీ గల, నిజమైన నిత్యం ఆనందపరిచే ఫ్రెండ్ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా చాలా అదృష్టం గా కూడ ఫీల్ అవుతూ ఉంటాను.. మళ్ళీ మనమిద్దరం కలవాలని పార్టీలు చేసుకోవాలని మరిన్ని విషయాలు మంచూ లక్ష్మి ట్యాగ్ చేసింది.
ఈ ఏడాది నీకు బాగా కలిసి రావాలని నువ్వు కోరుకున్నవన్నీ జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటు మంచు లక్ష్మి రాసుకొచ్చింది. ఇక రకుల్ ప్రీతిసింగ్, మంచు లక్ష్మి కలిసి గతంలో ఉండేటువంటి కొన్ని ఫోటోలు సైతం షేర్ చేస్తూ తెలియజేసింది. మంచు లక్ష్మి రకుల్ కూడా ఇద్దరు చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.