వంశీకి వైసీపీతో సంబంధం లేదా? వాసుపల్లి రిటర్న్ అవుతున్నారా?

-

ఏపీ రాజకీయాల్లో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్తితి కాస్త ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. అసలు వారు ఎందుకు పార్టీ మారారో..వారికే అర్ధం కాని పరిస్తితి వచ్చింది. సాధారణంగా పార్టీ మారితే…ఇక వారు ఏ పార్టీలోకి జంప్ చేశారో…ఆ పార్టీకి చెందిన నేతలే అవుతారు. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్తితి కనిపించడం లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్తితి అటు ఇటు కాకుండా ఉంది. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే.అయితే డైరక్ట్‌గా వైసీపీలోకి వస్తే పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి, వారు పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీని వదిలి…వైసీపీకి మద్ధతు ఇచ్చారు. వైసీపీ కండువాలు కప్పుకోలేదు. ఇప్పుడు ఇదే వారికి పెద్ద తలనొప్పి అయింది.
దీని వల్ల వారు వైసీపీ ఎమ్మెల్యేలుగా మారలేదు. అలా మారకపోవడమే పెద్ద మిస్టేక్ అయింది. అసలు జంపింగ్ ఎమ్మెల్యేలతో తమ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదన్నట్లు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మధ్య వల్లభనేని వంశీ…నారా భువనేశ్వరి గురించి సాక్షి మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వంశీ క్షమాపణ కూడా చెప్పారు. కానీ వంశీ మాటలకు…వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.
ఆ మధ్య ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అలాగే మాట్లాడారు..తాజాగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. అసలు వంశీతో తమకు సంబంధం లేదని అంటున్నారు. అంటే వంశీని వైసీపీ వాళ్ళు కలుపుకుంటున్నట్లు కనిపించడం లేదు. అదే సమయంలో టీడీపీ నుంచి వెళ్ళిన మరో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కూడా వైసీపీలో ఇమడలేకపోతున్నారట. ఈయనని వైసీపీ శ్రేణులు తమ నేతగా అంగీకరించడం లేదు. దీంతో ఈయన మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం. మొత్తానికి జంపింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ చుక్కలు చూపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news