జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ గండ్ర జ్యోతికి కొత్త స‌వాల్‌.. ప‌ద‌వికే గండం..

-

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క జిల్లాకు మరో జిల్లాకు పొత్తు, పొంతన ఉండదు. మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాను ఇతర జిల్లాలతో పోల్చి చూడలేం. ఇక్కడ రాజకీయం వింతగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్క‌డ జిల్లాల మార్పు అనేది మొద‌టి నుంచి వివాదాస్పదమైంది. తాజాగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ క్రమంలో మళ్లీ కొత్త చిక్కులు తెరమీదకు వచ్చాయి. ఈ విభజన వల్ల ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటూ వేరే జిల్లాలో ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నేత‌లే ఎక్కువ‌గా ఉంటున్నారు.భౌగోళికంగా ఒక జిల్లాలో ఉన్నా దాని నియోజ‌క‌వ‌ర్గ మండ‌లాలు మాత్రం వేరే జిల్లాలో ఉంటున్నాయి. తాజాగా ఈ విభజన భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మణారెడ్డి దంప‌తులకు ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లు సమాచారం. .ప్ర‌స్తుతం గండ్ర జ్యోతి వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌గా కొన‌సాగుతున్నారు.

 

 అయితే ఆమె ప్రాతినిథ్యం వ‌హిస్తున్న శాయంపేట మండ‌లం ఇన్ని రోజులు వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో ఉంది. కానీ, ఇప్పుడు అది కాస్త హన్మ‌కొండ జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చింది. ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చి ప‌డింది. దీంతో ఒక జిల్లాలోని మండలానికి జెడ్పీటీసీగా ఉంటూ వేరే జిల్లాలో జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఎలా కొన‌సాగుతారనే ప్రశ్న వినిపిస్తున్నది.

ఇది త‌మ నేతల రాజ‌కీయ భ‌విష్య‌త్తును ఇబ్బందుల్లో ప‌డేసేందుకు కొంద‌రు కావాల‌నే చేశారంటూ గండ్ర అభిమానులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు దీనిపై పూర్తి స్ప‌ష్టత వ‌చ్చే వ‌ర‌కు ఎవ‌రూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌ని ఆఫీసర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీ సీఈవో వ‌రంగ‌ల్‌లో పాత పాల‌క‌వ‌ర్గ‌మే కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తానికి గండ్ర దంప‌తుల‌కు విభజన వల్ల కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. చూడాలి ఏమవుతుందో మరి..

Read more RELATED
Recommended to you

Latest news