టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికేనా.. కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ ఎంపీ!

-

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త బాస్ ఎవ‌రొస్తారా అనేది గ‌తేడాది నుంచి తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తాను త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఈ ప‌ద‌విపై తీవ్ర పోటీ నెల‌కొంది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మ‌ధ్యే ఈ పోటీ నెల‌కొంది. ఒకానొక ద‌శ‌లో రేవంత్‌రెడ్డికే ప‌ద‌వి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా.. చివ‌ర‌కు ఈ ఎంపిక‌పై అధిష్టానం వెన‌క‌డుగు వేసింది.

అయితే ఇప్పుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చినా.. ఆయ‌న కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం తీసుకురాలేర‌ని చెప్పారు. అందుకే ఈ విష‌యంపై అధిష్టానం స‌రైన నిర్ణ‌యం తీసుకోలేక‌పోతోంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బ‌ల‌హీన ప‌డింద‌ని, అంతో ఇంతో తెలంగాణ‌లోనే ఉనికిలో ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే తాను మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లేది లేద‌ని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు దేశ వ్యాప్తంగాఎన్నిక‌లు అయిపోవ‌డంతో టీపీసీసీ ప‌ద‌విపై మ‌ళ్లీ చ‌ర్చ మొద‌లైంది. దీంతో రేవంత్ అభిమానులు త‌మ నాయ‌కుడికే ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆశ ప‌డుతున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news