నేడు ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తర ఖండ్ రాష్ట్రాలలో రెండో దశ పోలింగ్ ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. గోవాలో ఓటింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. గోవాలో నేడు సాయంత్రం 5 గంటల వరకు 75.29 శాతం ఓటింగ్ జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. కాగ గోవాలో నేడు మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. కోతంబి లో గల పోలింగ్ బూత్ లో ప్రస్తుత గోవా ముఖ్య మంత్రి ప్రమోద్ సావంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే ఉత్తర ఖండ్ లో సాయంత్రం 5 గంటల వరకు 59. 37 శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించారు. కాగ ఉత్తర ఖండలో తొలిసారి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా మహిళల కోసం 101 పోలింగ్ బూతను ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తర ప్రదేశ్ లో రెండో దశ పోలింగ్ లో సాయంత్రం 5 గంటల వరకు 60.44 శాతం ఓటింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగ యూపీలో రెండో దశ పోలింగ్ లో భాగంగా 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. యూపీలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఓటును రాంపుర్ లో గల పోలింగ్ బూత్ లో వినియోగించుకున్నారు. కాగ మూడో దశ పోలింగ్ ఈ నెల 20వ తేదీన జరగనుంది.