మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉంది కదా అని అసెంబ్లీని ఒక సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని పరోక్షంగా బిఆర్ఎస్ నేతలని ఉద్దేశించి ఆరోపించారు. పార్టీ మారుతున్నానని, పార్టీ మారనని చెప్పడం లేదని.. మనసులో ఆవేదన చెపుతున్నానన్నారు. గొంతు ఎత్తకుండా ఆనాడు లేనని… ఇప్పుడు వుండనన్నారు. పదవులు అవే వస్తాయన్న పొంగులేటి.. పోయేటప్పుడు అవే పదవులు వుండవన్నారు.
పదవులు అనుభవించినప్పుడు ప్రక్క వాడికి ఎం చేసావనేది కావాలన్నారు. పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం కాలేదన్నారు. ఎమ్మెల్యే లు ఆ ప్రాంతం లో రాజుల లాగా అరాచకాలు చేస్తున్నారని.. చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదని హెచ్చరించారు. తిరిగి వడ్డీ తో చెల్లించాల్సి వస్తోందన్నారు. గౌరవం లేని చోట, గౌరవించని చోట ఉండనన్నారు. టీఆర్ఎస్ లోకి రాక పోతే తాను ఓ కాంట్రాక్టర్ అని అన్నారు. జోలె వేసుకుని అయిన తిరిగి రాజకీయం చేస్తానన్నారు. మీరు నన్ను ఇబ్బందులు పెట్టవచ్చు… మిమ్ములను కొట్టేవారు వుంటారని హెచ్చరించారు.