‘భార్యను బుజ్జగించుకోవాలి లీవ్‌ ఇవ్వండి సర్‌..’ కానిస్టేబుల్‌ రాసిన లేఖ.!

-

స్కూల్‌, కాలేజ్‌, ఆఫీస్‌ ఎక్కడైనా లీవ్‌ కావాలంటే.. ఎప్పూడూ తలనొప్పే.. చదువుకునే రోజుల్లో అయితే కాలేజ్‌ బంక్‌ కొట్టాలంటే.. ఏదో ఒకటి చెప్పేవాళ్లం.. చనిపోయిన నానమ్మను పదే పదే చంపేసి లీవ్‌ తీసుకున్నవాళ్లు ఎంతమందో.. కానీ ఉద్యోగం వచ్చాక అలా కుదరదు..దేనికైనా ప్రూవ్స్‌ కావాలంటారు..దాదాపు నిజాలు చెప్పే లీవ్‌ తీసుకోవాలి.. అయితే ఓ కానిస్టేబుల్‌ లీవ్‌ కోసం రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. తన భార్యను బుజ్జగింజుకోవడానికి తనకు లీవ్‌ కావాలని కోరుతూ లేఖ రాశాడు.. ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

స్కూల్ బంక్ కొట్టేందుకు తల్లిదండ్రులకు విద్యార్థులు పలు కారణాలు చెబుతారన్న విషయం మనకు తెలిసిందే. తల నొస్తుందని, కడుపు నొస్తుందని, జ్వరం వచ్చిందని రకరకాల కారణాలు చెబుతుంటారు. తప్పక సెలవు కావాల్సి వచ్చినపుడు ఉద్యోగస్తులు కూడా పలు రకాల కారణాలు చెప్పి లీవ్ తీసుకుంటారు. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మినహాయింపు ఏం కాదు. అయితే ఓ పోలీస్ కానిస్టేబుల్ సెలవు కోసం చెప్పిన రీజన్ చాలా ఫన్నీగా ఉంది. తన భార్య అలిగిందని, ఆమెను బ్రతిమిలాడుకోవడానికి సెలవు కావాలని ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్ రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గౌరవ్​ చౌదరి అనే వ్యక్తి 2016 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. గౌరవ్​ చౌదరి స్వస్థలం యూపీలోని మౌ జిల్లా. ప్రస్తుతం అతడు మహారాజ్​గంజ్​ జిల్లాలోని నౌత్వానా పోలీస్​ స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నాడు. కానిస్టేబుల్ గౌరవ్‌కు 2022 డిసెంబర్‌లో పెళ్లైంది.. పెళ్లి అయిన మరుసటి రోజే భార్యను ఇంటి వద్ద వదిలి.. డ్యూటీలో చేరాడు. అప్పటినుంచి గౌరవ్‌కు సెలవులు దొరకలేదు. భార్య ఫోన్ చేస్తే.. లీవ్ దొరకగానే ఇంటికి వస్తా అని చెపుతూ నెట్టుకొస్తున్నాడు.. సతీమణి గట్టిగా నిలదీయగా.. మేనల్లుడి పుట్టినరోజున తప్పకుండా ఇంటికి వస్తానని భార్యకు మాట ఇచ్చాడు. అయితే మేనల్లుడి పుట్టిన రోజు రాకముందే గౌరవ్​ చౌదరి సతీమణి అతడి ఫోన్ కాల్ ఎత్తడం మానేసింది. కాల్ ఎత్తకుండా తన కోపాన్ని ప్రదర్శిస్తుందని కానిస్టేబుల్ గౌరవ్‌కు మ్యాటర్‌ అర్థమైంది. ఇలాగే ఉంటి మ్యాటర్‌ సీరియస్‌ అవుతుంది అనుకున్నాడేమో..! ఇక చేసేది లేక ఏడు రోజులు సెలవు కావాలని ఏఎస్పీకి లేఖ అతడు రాశాడు. ‘పెళ్లి అయిన మరుసటి రోజే నా భార్యను వదిలి వచ్చాను. నాపై చాలా కోపంగా ఉంది. ఫోన్ కాల్ ఎత్తడం లేదు. మేనల్లుడి పుట్టినరోజున తప్పకుండా ఇంటికి వెళ్లాలి. నాకు ఏడు రోజులు సెలవులు కావాలి’ అన్ని ఏఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.

కానిస్టేబుల్ గౌరవ్​ చౌదరి రాసిన లేఖను ఏఎస్పీ అతీశ్ కుమార్ సింగ్ చదివారు. కానిస్టేబుల్​ ఇబ్బందిని అర్థం చేసుకుని ఏఎస్పీ లీవ్స్ మంజూరు చేశాడు. అయితే కానిస్టేబుల్ గౌరవ్ కోరిన 7 రోజులు కాకుండా.. 5 రోజులు సెలవులు ప్రకటించాడు. జనవరి 10 నుంచి గౌరవ్​ చౌదరి సెలవుపై ఇంటికి వెళ్లారు.. అయితే కానిస్టేబుల్ గౌరవ్​ చౌదరి రాసిన లేఖ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. పోలీస్‌ ఉద్యోగం అంటే.. ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిందే..!ఇదొక్కటే కాదు..చాలా ఉద్యోగాలలో లీవ్స్‌ అంత ఈజీగా ఇవ్వరు..! చాలా బతిమిలాడుకుంటేకానీ లీవ్స్‌ దొరకవు.. ఇంతకీ మీకు ఈ సంక్రాంతికి మీ బాస్‌ లీవ్‌ ఇచ్చారా..?

Read more RELATED
Recommended to you

Latest news