డిసెంబర్ నాటికి పేదలకు ప్రభుత్వ భూముల పంచుతాం – మంత్రి పొంగులేటి

-

డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు ప్రభుత్వ భూముల పంచుతామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నల్లగొండ జిల్లా తిరులమగిరి -సాగర్ మండలం, నెల్లికల్ లో.. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన ఫైలెట్ ప్రాజెక్టును స్వయంగా పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భభంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… మార్పు కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం పనిచేసి అధికారంలోకి వచ్చామని తెలిపారు. యాచారం, తిరుమలగిరి మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని… వాటి పరిష్కారంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు.

రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతన్నకు భూమీ విషయంలో భయం లేకుండా చేస్తామని.. ధరణి పోర్టల్ తో BRS ప్రభుత్వం ఆటలు ఆడిందని ఆగ్రహించారు. ఇప్పడు 2020 చట్టాన్ని సవరణ చేస్తూ.. ప్రజలకు అనువైన ఆర్.ఓ.ఆర్ చట్టం అమలు చేస్తామని.. ఈ చట్టాల విషయంలో ప్రతిపక్ష పార్టీల సలహాలు, సూచనలు స్వీకరిస్థామని తెలిపారు.

అటవీ, రెవిన్యూ శాఖల మధ్య వివాదం ఉన్న భూమి సమస్యలు పరిష్కారం చేస్తామని.. గత ప్రభుత్వ తప్పిదలతో.. భూమి లేకున్నా పాస్ పుస్తకాలు సృష్టించి రైతుబంధు పొందారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వo నిజమైన రైతులకు లబ్ధి చేయడమే లక్ష్యమని… అధికారం కోల్పోయిన ప్రస్ట్రేషన్ లో.. మాపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news