అరెస్టు చేసుకోండని కవిత చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదు – పొన్నం ప్రభాకర్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేస్తే చేసుకోండని ఎమ్మెల్సీ కవిత చెప్పిన కేంద్రం పట్టించుకోవడంలేదని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. అవినీతి ఆరోపణలకు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయకుండా.. అరెస్టు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

కెసిఆర్ కు నిజాయితీ ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ కుటుంబం ల్యాండ్, సాండ్, స్కామ్ లతోపాటు ఇప్పుడు లిక్కర్ స్కామ్ కు కూడా పాల్పడిందని విమర్శించారు. ఇక మంత్రి గంగుల కమలాకర్ సిబిఐ, ఈడీ కేసులతో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విషయంలో చిల్లరగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని.. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news