సిరిసిల్ల కార్మికులకు బండి సంజయ్ అన్యాయం చేశారు – పొన్నం ప్రభాకర్

-

సిరిసిల్ల కార్మికులకు బండి సంజయ్ అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ లో కూడ 70 శాతం పవర్ లూమ్స్ సిరిసిల్ల లో ఉన్నాయని.. సిరిసిల్ల పరిశ్రమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు.

దేశంలో కేంద్ర ప్రభుత్వం 9 మెగా క్లష్టర్లు మంజూరు చేస్తే …తెలంగాణ కి ఒకటి ఇచ్చారు..అది సిరిసిల్ల లో నెలకొల్పే బాధ్యత బీజేపీ బండి సంజయ్ చొరవ తీసుకోవాలి..కేంద్రం లో బీజేపీ ఉంది..టెక్స్ట్ టైల్ ఇండస్ట్రీ, కార్మికుల సమస్యల పై కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామనీ వెల్లడించారు.

సిరిసిల్ల టెక్స్ట్ టైల్ పట్ల వివక్ష కొనసాగుతుంది…బీజేపి ఎంపి బండి సంజయ్ పట్టించుకోవడం లేదని వెల్లడించారు. బండి సంజయ్, ఎంపి వినోద్ కుమార్ మీకు సవాల్ చేస్తున్న సిరిసిల్ల కి మీరు ఎం చేశారు..వెల్ఫేర్ నుండి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలి.. కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన ప్రిసైడింగ్ బండి సంజయ్ కి పంపిస్తున్నానన్నారు పొన్నం.

Read more RELATED
Recommended to you

Latest news