చిరంజీవి కోసం అదిరిపోయే కథ రెడీ చేసిన పూరీ జగన్నాథ్.!

-

విజయ్‌ దేవరకొండ హీరోగా.. మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్‌, పూరీ జగన్నాథ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ వేద్దామనుకున్న పూరీ జగన్నాథ్ కు నిరాశే ఎదురైంది. ఇక ఏమంటూ ఈ సినిమా చేశారో కాని ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయినా కూడా వివాదాలు వదిలి పెట్టడం లేదు.

తాజాగా వస్తున్న సమచారం ప్రకారం  డైరెక్టర్ పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ కథ రాస్తున్నాడని తెలుస్తోంది. దీని కోసం పూరి తన టీమ్ తో కలిసి గోవాలో కూర్చోని మరీ స్క్రిప్ట్ పై కూర్చోని బాగా వర్కౌట్ చేశాడట. పూర్తి కథ కోసం చాలా మనసుపెట్టి రాశాడట. ఇక పూర్తి స్తాయిలో కథ కూడా సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.త్వరలోనే మెగాస్టార్  చిరంజీవి గారి టైమ్ తీసుకొని ఈ కథను చిరుకు,పూరి వినిపించబోతున్నాడు. పూరి కథలో మంచి డెప్త్ ఉందని తెలుస్తోంది.

ఈ కథ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఈ కథ చాలా డిఫరెంట్ గా ఊహించని బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందట. ఇది ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య సాగే కథ , దానిలో మంచి ఎమోషన్ కూడా పూర్తి స్కోప్ ఉందని తెలుస్తోంది ఉంటుందట. అలాగే సెంటిమెంట్ ఉన్నా కూడా మెయిన్గా యాక్షన్ బేస్డ్ గానే సినిమా నడుస్తోందని తెలుస్తోంది. లైగర్ తర్వాత పూరి గాడ్ ఫాదర్ సినిమా లో నటించిన టైంలో మంచి కథ ఉంటే సినిమా చేద్దామని చిరు అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తో అయినా పూరీ జగన్నాథ్ కెరియర్ గాడిన పడుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news