పోస్టాఫీసులో పెట్టుబడి… నెలకు రూ.5 వేల వరకు సంపాదన

-

సురక్షితమైన పెట్టుబడితో నెల నెలకు డబ్బు సంపాదించాలనుకునే వారికి భారతీయ తపాల శాఖ (ఇండియన్ పోస్ట్) మంచి అవకాశాన్ని కల్పింస్తుంది అదే పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్(ఎమ్ఐఎస్). ఈ పథకం ద్వారా మీరు నెలకు రూ.5 వేల వరకు సంపాదించవచ్చు. ఇక పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వివరాలు చూస్తే… మీ దగ్గరలోని ఏదైనా పోస్టాఫీసులో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. దీని కోసం ఎంఐఎస్ ఫారంతో పాటు సంబంధిత చిరునామా, గుర్తింపు పత్రాలు, రెండు ఫొటోలు ఏదైనా పోస్టాఫీస్లో సమర్పించాలి.

 

సింగిల్‌గా, గానీ జాయింట్ గా గానీ ఖాతా తెర‌వ‌చ్చు. సింగిల్‌గా ఖాతా తెరిస్తే.. గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకు,జాయింట్ ఖాతా తెరిచినట్లయితే, గరిష్ఠంగా రూ.9 లక్షల వరకూ పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తారు. క‌నీసం రూ.1500తో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఈ ప‌థ‌కం ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 6.6 శాతం కాగా…ఈ వడ్డీ రేటుతో ప్రతీ నెల రూ.4950 చొప్పున ఆదాయం పొందవచ్చు.పెట్టుబడి పెట్టిన మొదటి నెల నుంచి వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ డబ్బును పోస్టాఫీసు నుంచి నేరుగా పొందవచ్చు లేదా మన సేవింగ్స్ ఖాతాలో లేదా బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

ఈ స్కీమ్ లాక్-ఇన్ పిరియ‌డ్ 5 సంవ‌త్స‌రాలుగా ఉంది. అయితే డిపాజిట్ చేసిన ఏడాది తర్వాతఈ స్కీమ్ వద్దనుకుంటే దీనికి సంబంధించిన ఖాతాను మూసివేసి నగదును విత్డ్రా చేసుకోవచ్చు. అయితే, ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేస్తే డిపాజిట్ మొత్తం నుంచి 2 శాతం కోత విధిస్తారు. అదే మూడేళ్లు నిండిన త‌ర్వాత‌ ఐదేళ్లు పూర్తి కాక మందు ఖాతా మూసివేస్తే, డిపాజిట్ మొత్తం నుంచి 1శాతం కోత విధిస్తారు. ఇక మెచ్యూరిటీ స‌మ‌యంలో పూర్తి అయితే మొత్తం నగదును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. లేదా తిరిగి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు

Read more RELATED
Recommended to you

Latest news