మ‌రోసారి జోడీ క‌డుతున్న సామ్‌, చెయ్‌.. మ్యాజిక్ రిపీట్ చేస్తారా?

-

నాగ‌చైత‌న్య-స‌మంత జోడీకి ఉన్న‌క్రేజ్ మ‌రే జోడీకి లేద‌నే చెప్పాలి. వీరిద్ద‌రూ క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సినిమాలు చేశారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ సూప‌ర్ అని ఇప్ప‌టికే ఎన్నోసార్లు నిరూపించారు. నిజ జీవితంలో కూడా బ్యూటిఫుల్ జోడీగా వివాహ జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రూ మ‌రోసారి క‌లుస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 

ఇప్ప‌టికే వీరిద్ద‌రూ లాస్ట్‌గా మ‌జిలీ చేశారు. ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయింది. దీని త‌ర్వాత ఇప్పుడు ఇంకో సినిమాలో చేస్తున్నారు. క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన సోగ్గాడే చిన్నినాయ‌న ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే.

దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు సినిమా చేస్తున్నాడు నాగార్జున‌. ఇందులో చైత‌న్యకు జోడీగా స‌మంత న‌టిస్తోంద‌ని తెలుస్తోంది. ఇందులో వీరిద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయ‌ని స‌మాచారం. మ‌రి ఇన్నేళ్ల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news