పోస్ట్ ఆఫీస్ నుండి అదిరే స్కీమ్స్..!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. పైగా పోస్ట్ ఆఫీస్ తో ఎలాంటి రిస్క్ ఉండదు. సురక్షితమై, నమ్మకమైన పెట్టుబడులకు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉపయోగ పడతాయి. అందుకని చాలా మంది పోస్టాఫీస్ స్కీమ్‌లలో డబ్బులు పెడుతూ వుంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా ప్లాన్స్ ని పోస్ట్ ఆఫీస్ ఇస్తోంది. మరి పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ గురించి చూద్దాం.

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్:

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌ లో డబ్బులు పెడితే మంచిగా డబ్బులు వస్తాయి. మీ డబ్బును రెట్టింపు చేయాలనుకుంటే ఈ స్కీమ్ బెస్ట్. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 6.9 శాతం వడ్డీ వస్తుంది. ఇప్పుడు దానిని 7.0 శాతానికి పెంచింది కేంద్రం. ఇందులో డబ్బులు పెడితే 124 నెలల్లో రెట్టింపు అయ్యేది. ఇప్పుడు మాత్రం 123 నెలల్లోనే రెట్టింపు అవుతోంది. 18 సంవత్సరాలు లేదంటే ఎక్కువ వయస్సు వున్నవాళ్లు అంతా అర్హులే.

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌:

0 నుండి 10 సంవత్సరాల వరకు ఆడపిల్లల పేరిట సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ ని ఓపెన్ చెయ్యచ్చు. కుమార్తెల భవిష్యత్తుకు భద్రత కలిపించేందుకు ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం 7.6 శాతం వడ్డీ ని ఇస్తోంది. రూ. 250 నుండి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి ని పెట్టవచ్చు. 80C కింద పన్ను మినహాయింపు కూడా వుంది.

మంత్లీ ఇన్కమ్ స్కీమ్:

ఈ స్కీమ్ కూడా మంచి స్కీమ్. 6.7 శాతం వార్షిక వడ్డీ ఇప్పుడు వస్తోంది. ప్రతి నెలా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ స్కీమ్ ఐదేళ్ల పాటు ఉంటుంది. గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news