దిల్లీలో మోదీపై వివాదాస్పద పోస్టర్లు.. 100 FIRలు నమోదు చేసిన పోలీసులు

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలతో దిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఈ వ్యవహారంలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యంతరకర పోస్టర్లు అంటించడంపై వందకు పైగా ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారు.

‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ (మోదీని తొలగించండి.. దేశాన్ని కాపాడండి) అనే నినాదంతో ఉన్న పోస్టర్లు దిల్లీలోని పలు ప్రాంతాల్లో కనిపించాయని స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్ట్ చేశామని.. వందకు పైగా ఎఫ్ఐఆర్​లు నమోదు చేశామని వెల్లడించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తయారు చేసిన 50 వేల పైగా వివాదాస్పద పోస్టర్లను.. దిల్లీలో వేసేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు.

దీని వెనక ఆప్ నేతల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆప్ కార్యాలయం నుంచి ఓ వ్యాను బయటకు రాగానే అడ్డుకున్నామని దీపేంద్ర పాఠక్ తెలిపారు. అందులో నుంచి కొన్ని పోస్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని దీపేంద్ర స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news