BREAKING : తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా

-

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ 4 ఉద్యోగాలకు ఇవాల్టి నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ టీఎస్పీఎస్సీ ప్రకటన చేసింది.

సాంకేతిక కారణాలతో దరఖాస్తు ప్రక్రియ వాయిదా వేసినట్లు తాజాగా కీలక ప్రకటన చేసింది. మొత్తం 25 ప్రభుత్వం విభాగాల పరిధిలో ఏకంగా 9168 పోస్టులకు ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. త్వరలో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే.. గ్రూప్ 4 ఉద్యోగాలకు ఇవాల్టి నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా వేసింది TSPSC.

Read more RELATED
Recommended to you

Latest news