సర్పంచ్ గా స్పీకర్ భార్య.. పోటీగా టీడీపీ నుండి తోడికోడలు !

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి.. ఎలాగైనా గెలిచి తీరాలని వైసిపి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. టిడిపి సహా మిగతా పార్టీలు కూడా సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. ఈ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.. మరో పక్క ఆమెకు పోటీగా తెలుగుదేశం నుంచి సీతా రామ్ అన్న శ్యామల్రావు భార్య భారతి పోటీ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

తన భార్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకు గాను, తన అన్నభార్యను నామినేషన్ వేయకుండా అడ్డుపడుతున్నారని నిన్న టీడీపీ నేత కూన రవికుమార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎలా అయినా తన భార్య సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆయన అన్న భార్య అని కూడా చూడకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం మీద ఈ నామినేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది అని మాత్రం చెప్పక తప్పదు.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...