ట్రెండింగ్ లో ప్రభాస్ సినిమాలు.. అప్పుడే పుకార్లు స్టార్ట్..

-

నేషనల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలు చూస్తుంటే అందరికీ మతిపోతుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాధేశ్యామ్ తో పాటు మరో రెండు చిత్రాలు లైన్లో ఉన్నాయి. తాజాగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చింది. దాంతో జాబితా మరింత పెద్దగా పెరిగింది. సలార్ పేరుతో రూపొందనున్న ఈ సినిమాని హాంబలే బ్యానర్ నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా, గ్యాంగ్ స్టర్ల నేపథ్యంలో సాగనుందని వినిపిస్తుంది.

చేతిలో ఇన్ని క్రేజీ ప్రాజెక్టులు పెట్టుకున్న ప్రభాస్, అభిమానులని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐతే అదే క్రమంలో ప్రభాస్ సినిమాలపై పుకార్లు అప్పుడే మొదలయ్యాయి. సలార్ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దగ్గర నుండి విలన్ గా ఎవరు చేస్తున్నారు..? ఎప్పుడు రిలీజ్ అవనుంది.. నాగ్ అశ్విన్ తో చేస్తున్న తర్వాత రిలీజ్ అవుతుందా లేదా ముందే రిలీజ్ అవనుందా అనే లక్ష ప్రశ్నలు మెదులుతున్నాయి. అనుకోకుండా అప్డేట్లు ఇస్తున్న ప్రభాస్, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news