ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమా నుండి అప్డేట్ రాబోతుంది..

-

అక్టోబర్ 23వ తేదీ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ సినిమాల అప్డేట్ల కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చేతిలో ఉన్న మూడు సినిమాల నుండి మూడు సర్ప్రైజ్ లు రానున్నాయని ఆశగా ఉన్నారు. ఐతే పుట్టినరోజు దాకా వెయిట్ చేయకుండానే ప్రభాస్ అభిమానులకి సర్పైజ్ గిఫ్ట్ రాబోతుంది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాపై అప్డేట్ రాబోతుందంటూ వైజయంతీ మువీస్ అధికారికంగా ప్రకటించింది.

ఈ విషయమై ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసిన వైజయంతీ మూవీస్, అప్డేట్ కి రెడీగా ఉండడని బిగ్ అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలిపింది. రేపు ఉదయం పది గంటలకి ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమాపై సర్పైజ్ గిఫ్ట్ రానుంది. సో.. ప్రభాస్ అభిమానులకి పండగ మొదలైనట్లే. ఐతే ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అలోచిస్తున్నారు. ఇంకా షూటింగ్ మొదలవలేదు కాబట్టి టైటిల్ రివీల్ చేస్తున్నారేమో అని అంచనా వేస్తున్నారు. మరి రేపేం రివీల్ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news