చంద్రబాబు ఏది ఎందుకు చేస్తున్నారో.. ఎలా ఆలోచిస్తున్నారో.. అలా ఆలోచించడం వల్ల జనాలు ఏమనుకుంటారో అనే ఆలోచనలు ఏమాత్రం లేకుండా ముందుకుపోతున్నారు! ఇందులో భాగంగా అమరావతి రైతులను అప్పటికప్పుడే ఖుషీ చేసిన చంద్రబాబు.. మరి కాసేపటిలోనే గాలి తీసేశారు!
అవును… ప్రస్తుతం ఏపీకి చుట్టం చూపుగా వచ్చిపోతున్న చంద్రబాబు… తాజాగా మరోసారి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. దీంతో… అమరావతి రైతులు ఫుల్ ఖుషీ అయ్యారు! సోమవారానికి అమరావతిలో నిర్వహిస్తోన్న నిరసనల కార్యక్రమం 300వ రోజుకి చేరుకోనున్న తరుణంలో.. బాబు ఏదో ఒక సంచలన నిర్ణయం ప్రకటిస్తారని.. ప్రత్యక్షంగా ఆయన కూడా ఉద్యమంలో పాల్గొంటారని అంతా భావించారు!
కానీ… జనం ఒకటి తలిస్తే చంద్రబాబు మరొకటి తలుస్తారు! కాబట్టి… అలాంటి ఆలోచనలు ఆశలు తనపై ఏమీ పెట్టుకోవద్దని పరోక్షంగా చెప్పిన చంద్రబాబు… సోమవారం అమరావతిలో జరుగుతున్న నిరసనల 300వ రోజున “ఆన్ లైన్”లో పాల్గొంటారని.. “ఆన్ లైన్” లో ప్రసంగిస్తారని.. “ఆన్ లైన్”లో సంఘీభావం తెలుపుతారని చెబుతున్నారంట! దీంతో బాబు ఇలా చేశారేంటని అమరావతి రైతులు ఫీలవుతున్నారంట!
ఇంతోటి దానికి ఉండవల్లి రావడం ఎందుకు? ఏదో మాకోసం ప్రత్యేకంగా వస్తున్నట్లు బిల్డప్ ఎందుకు? ఆన్ లైన్ లో చేసేపాటికి హైదరబాద్ లో ఉంటే ఏమిటి అమరావతిలో ఉంటే ఏమిటి అని చెబుతున్నారంట రైతులు! కాగా… చివరిసారిగా ఈ.ఎస్.ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు బెయిల్ పై విడుదలైనప్పుడు ఆయన్ని పరామర్శించేందుకు విజయవాడకు వచ్చిన చంద్రబాబు.. రెండు రోజులు ఉండి మరళా హైదరాబాద్ లోని ఇంటికెళ్లిపోయారు!
-CH Raja