పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. దీపికా పదుకొణె హీరోయిన్గా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.
ప్రాజెక్టు కె సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తోంది.