ప్రభాస్.. సలార్ టైటిల్ అర్థం ఇదే..

-

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హాంబలే ఫిలింస్ పతాకంపై సలార్ పేరుతో సినిమా తెరకెక్కుతుందని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూడు సినిమాలని లైన్లో పెట్టిన ప్రభాస్, నాలుగవ సినిమాగా సలార్ ని తీసుకువచ్చాడు. సినిమా ప్రకటన వచ్చే వరకు ఎలాంటి పుకార్లు రాని ఈ సినిమాపై, తాజాగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో పాటు ప్రభాస్ అభిమానుల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. దాన్లో మొదటగా సలార్ అంటే అర్థమేమిటనే.

ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి, పాన్ ఇండియా లెవెల్లో ఒకే టైటిల్ ఉండాలన్న నేపథ్యంలో సలార్ అని నిర్ణయించారు. సలార్ అనేది ఉర్దూ పదం. ధైర్యవంతుడైన ప్రతినాయకుడు అని దానర్థం. ప్రభాస్ ని అత్యంత ధైర్యవంతుడైన ప్రతినాయకుడిగా చూడబోతున్నాం అన్నమాట. ఆల్రెడీ సినిమా క్యాప్షన్ ద్వారా ప్రభాస్ ఎంత వయలెంట్ గా కనిపిస్తాడో చెప్పేసారు.

Read more RELATED
Recommended to you

Latest news