ప్రగతి నివేదన సభ పై హైకోర్టులో పిటిషన్

-

 

హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది

తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న తలపెట్టిన ప్రగతి నివేదన సభను ఆపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ సభ వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది పూజారి శ్రీధర్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.  ప్రభుత్వం తమ ప్రగతి నివేదనను అనేక రకాల మాధ్యమాల ద్వారా తెలియజేయవచ్చు, గతంలో ఇందిరాపార్కుతో పాటు కొన్ని విశ్వవిద్యాలయాల్లో సభల నిర్వాహణకు ప్రభుత్వం అనుమతి నిరాకరించన సంగతిని ఆయన గుర్తు చేశారు. సభ నిర్వాహణకు అధిక మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించడంతో పాటు, సామన్యులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. దీంతో సభకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వూలు జారీ చేయాలని శ్రీధర్ కోరారు.

దీంతో రేపు మధ్యాహ్నం  ఈ పిటిషన్ పై వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. రేపటి హైకోర్టు నిర్ణయానుసారంగా రాజకీయ పక్షాలు తమ వ్యూహాన్ని రచిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news