విజయ్ ఎఫెక్ట్ నాని మీద పడ్డది

-

అర్జున్ రెడ్డి ఒక్క సినిమాతో యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా వచ్చిన గీతా గోవిందం సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా కలక్షన్స్ చూస్తే స్టార్ హీరోలు సైతం అవక్కయ్యేలా ఉన్నాయి. సీనియర్ స్టార్ హీరోలను పక్కన పెడితే పవన్, మహేష్, ఎన్.టి.ఆర్, ప్రభాస్, చరణ్, బన్ని ఇలా అందరికి సెపరేట్ ఫ్యాన్స్ గ్రూప్స్ ఉన్నాయి.

అయితే మొన్నీమధ్యనే స్టార్ గా మారిన నానికి ఇప్పుడిప్పుడే సెపరేట్ ఫ్యాన్స్ వస్తున్నారు. ఈ టైంలో విజయ్ కు యూత్ లో ఫాలోయింగ్ చూసి నాని మీద కచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. వరుసగా హిట్లు కొడుతున్నా సరే నాని మీద రొటీన్ క్యారక్టరైజేషన్ అంటూ ఓ ఇన్నర్ కామెంట్ కూడా వినిపిస్తుంది.

మొత్తానికి తన సినిమాతో మొదటి ఆఫర్ ఇచ్చిన నానికే విజయ్ షాక్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పొచ్చు. నానికి సాధ్యం కాని 2 మిలియన్ డాలర్స్ తో పాటుగా 100 కోట్ల క్లబ్ లో చేరిన యువ హీరోగా విజయ్ స్టామినా గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి నాని ఇకనుండైనా జాగ్రత్తపడతాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news