ప్రకాశం ప్రభుత్వ పాఠశాలలో 24 మంది టీచర్లు, 5 విద్యార్థులకు కరోనా

-

ప్రకాశం ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలవరం రేపుతోంది. ఆ ప్రభుత్వ పాఠశాలలో ఏకంగా 24 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంగళవారం 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధ నేతర సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అమ్మన బ్రోలు హైస్కూల్ లో ఓ పదవ తరగతి విద్యార్థి సహా ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఇక రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో ఉపాద్యాయ వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల్లో కనీసం శానిటైజర్లు కూడా వాడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఏపీలో  గ‌డిచిన 24 గంట‌ల‌లో కేవ‌లం 41,713 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తే.. ఏకంగా 10,057 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. అంటే ప్ర‌తి న‌లుగురి కి కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేస్తే అందులో ఒక‌రు క‌రోనా బ‌రినా పడ్డారు. రాష్ట్రంలో నిన్న‌టి కంటే క‌రోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగాయి. నిన్న రాష్ట్రంలో 6,996 కేసులు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news