Prakash Raj: ప‌వ‌న్‌ మార్నింగ్ షో క‌లెక్ష‌న్ల అంతా ఉండ‌వు.. మీ సినిమా బ‌డ్జెట్లు.. ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రచారంలో వేడి పెరుగుతుంది. ఈ ఎన్నికల హడావుడిని చూస్తేంటే.. సాధారణ ఎన్నికలను తలదన్నేలా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష బరిలో ఉన్న వారు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇ బండ్ల గణేశ్ పోటీ నుంచి తప్పుకోగా.. ఇప్పుడు ప్రకాశ్‌ రాజ్‌, విష్ణుల మధ్య ద్విముఖ పోటీ సాగుతుంది.

తాజాగా ప్ర‌కాశ్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ ప్రెస్ మీట్స్ పెట్టి ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మా ఎన్నికల్లోకి పవన్‌ కళ్యాణ్‌ పేరును లాగడంపై అసంతృప్తి వ్య‌క్తంచేశారు ప్రకాశ్‌ రాజ్‌. పవన్‌ గురించి మాట్లాడేప్పుడు.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చ‌రించారు. అస‌లు ఈ ఎన్నికల్లోకి చిరంజీవి, కృష్ణ లాంటి పెద్ద‌ల‌ను ఎందుకు లాగుతున్నార‌ని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

పవన్ సినిమాల మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండ‌వు.. మీ సినిమాల మొత్తం బడ్జెట్లు.. అలాంటిది మీరు ఆయన మీద కామెంట్లు చేయ‌మేంటీ అని ప్రకాశ్‌రాజ్‌ విమర్శించారు. ఈ వ్యాఖ్య‌ల‌తో .. పవన్ ఫ్యాన్స్ అయితే ప్రకాష్ రాజ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక మా ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకున్న బండ్ల గణేష్.. ప్రకాష్ రాజ్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. మరి మా ఎన్నికలు పూర్తయ్యేలోపు ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news