”మా” ఎన్నికలలో బిగ్‌ ట్విస్ట్‌ : వైసీపీ నేతలపై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు !

మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల వివాదం ఇంకా కూడా చెలరేగుతోంది. తాజాగా మా ఎన్నికల ఫలితాలు మరియు ఎన్నికల నిర్వహణ పై మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ గారికి ప్రకాష్‌ రాజ్‌ లేఖ రాశారు. బయట వాళ్లు మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఓటర్లను బెదిరించారని.. ముఖ్యంగా ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని… కొంత మంది రౌడీషీటర్లు… ఓటర్లను బెదిరించారని ఆరోపణలు చేశారు.

ఈ రౌడీ షీటర్లు వైసీపీ పార్టీకి చెందిన వారుగా తమకు అనుమానం ఉందన్నారు ప్రకాశ్‌ రాజ్‌. ఈ మేరకు మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ కు ఫిర్యాదు చేశారు ప్రకాశ్‌ రాజ్‌. దీనిపై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా…. మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల సమయంలో… మోహన్‌ బాబు మరియు మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల పై దాడులు చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఈ మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికలు వివాదంగా మారాయి.