జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాపై కొత్త డిమాండ్ ను తెర పైకి వచ్చారు పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. ఇది డిమాండ్ కాదని… ఒక హక్కుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తరవాత జనసేన ఆ ప్రక్రియ చేపడుతుందని… అధికార మార్పిడి తర్వాత ‘దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా’గా పేరుగా మారుస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినప్పుడు.. సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమేనని స్పష్టం చేశారు. దామోదరం సంజీవయ్య పేరు ఒక్క పథకానికీ పెట్టలేదని వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహనీయుడు దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. తమ డిమాండ్ పై జగన్ సర్కార్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.