కంగనాపై ప్రకాష్ రాజ్ సెటైర్…

బాలీవుడ్ నటి కంగనా రనౌత్, గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ ఉంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ పెద్దలపై కామెంట్లు చేస్తూ ఉంది. ఐతే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంతో కంగనాకి పెద్ద యుద్ధమే జరుగుతోంది. కంగనా ఆఫీసుని కూల్చేసిన నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ మరింత రెచ్చిపోయి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్ల నుండి కంగనాకి మద్దతు కూడా వస్తుంది. అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడంపై కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే ఒక పక్క కంగనాకి మద్దతు బాగానే ఉన్నా, మరో పక్క కంగనా పై విమర్శలు వెల్లువెతుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కంగనా సినిమా నుండి తప్పుకోవడం, ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించడం ఆసక్తి రేపింది. తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, కంగనాపై సెటైర్ వేసాడు. ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నలని సంధించే ప్రకాష్ రాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి సినిమాతో కంగనా రాణి అయితే మరి పద్మవత్ లో దీపికా, అక్బర్ గా హృతిక్, అశోకుడిగా షారుఖ్, అజయ్ భగత్ సింగ్, ఆమిర్ మంగళ్ పాండే, వివేక్ ఒబెరాయ్ మోదీ అవుతారా అంటూ పొస్ట్ పెట్టాడు.